MBNR: చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.