NGKL: చారకొండ మండలం దొంగలగుట్ట తండాకు చెందిన రాత్లావత్ వీరసింగ్కు మంజూరైన రూ. 21,500 ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును ఆదివారం పంపిణీ చేశారు. సర్పంచ్ అమీనా రాథోడ్ చేతుల మీదుగా ఈ చెక్కును బాధితుడికి అందజేశారు. తన ఆర్థిక పరిస్థితిని గుర్తించి సాయం అందించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వీరసింగ్ కృతజ్ఞతలు తెలిపారు.