BHPL: మహదేవపూర్ మండలంలోని చంద్రుపల్లి గ్రామంలో చేతిపంపు చెడిపోవడంతో నెలకొన్న మంచినీటి సమస్యను ఆదివారం గ్రామస్తులు వార్డ్ సభ్యులు సర్పంచ్ గుర్సింగ బాపు దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచ్ బాపు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని, పంపును మరమ్మతు చేయించారు. దీంతో గ్రామ ప్రజల నీటి ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్తులు సర్పంచ్ గారికి , కృతజ్ఞతలు తెలిపారు.