పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ దేశంలో 5 కిలోల చిన్న LPG సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. MAR 23 నుంచి ఇప్పటివరకు 6.6 లక్షల సిలిండర్లు అమ్ముడైనట్లు కేంద్రం తెలిపింది. సరైనా గుర్తింపు పత్రాలు చూపించి సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద వీటిని తీసుకోవచ్చని సూచించింది. మరోవైపు MAR నుంచి నేటి వరకు 50వేలకు పైగా బ్లాక్ చేసిన సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పింది.