HNK: భారత తొలి ఉప ప్రధాని, హక్కుల నేత బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ చావత్ బజ్ పాయ్ వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని యువతకు పిలుపునిచ్చారు.