MDK: పెద్ద శంకరంపేట మండలంలోని పలు చర్చిలలో క్రైస్తవులు ఈస్టర్ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈస్టర్ వేడుకలను పురస్కరించుకొని పలు చర్చిలలో తెల్లవారుజామున కొవ్వొత్తులు వెలిగించారు. అనంతరం పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో క్రైస్తవులు సామూహికంగా ప్రార్ధనలు నిర్వహించారు. వేడుకలలో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.