VKB: బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం జగ్జీవన్ రామ్ తన జీవితాంతం కష్టపడ్డారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు.