అన్నమయ్య: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి డా. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని తెలిపారు.