NZB: వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కవిత ఆదివారం X వేదికగా డిమాండ్ చేశారు. వడగళ్ల వాన బోధన్ నియోజకవర్గ రైతులకు కన్నీటిని మిగిల్చిందని సాలూర, ఖాజాపూర్, హున్సా, మందర్నా గ్రామాల్లో వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.