NLG: గుడిపల్లిలో సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ నాయకుడు యర్ర యాదగిరి నివాళులర్పించి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.