TPT: బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో భారతీయ జనతా పార్టీ సంఘటన పర్వలో భాగంగా మండల అధ్యక్షుని ఎన్నిక జరిగింది. ఎన్నికల అధికారిగా జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్. ముని సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునికృష్ణయ్య తదితరుల సమక్షంలో కంచనపుత్తూరు గ్రామానికి చెందిన దాస్ గురునాథ్‌ను ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.