VZM: అత్యధిక లాభాలను ఇచ్చే ఉద్యాన పంటలను సాగు చేయాలని జిల్లా రైతాంగానికి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. భోగాపురం మండలంలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కొయ్యపేటలో రైతులు సాగుచేస్తున్న ఉద్యాన పంటలను పరిశీలించారు. పొలాల్లో దిగి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.