కోనసీమ: అల్లవరంలో మాజీ మంత్రి ఆర్కే రోజా మంగళవారం సందడి చేశారు. మాజీ ఎంపీ చింతా అనురాధ ఆహ్వానం మేరకు అల్లవరం మండలం మొగళ్లమూరులో ఎంపీ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రోజాకు అనురాధ ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవగుప్తం శివాలయంలో జరుగుతున్న సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవంలో రోజా పాల్గొన్నారు.