E.G: తాళ్లపూడిలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి 140వ కళ్యాణ మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి మండల కూటమి నాయకులు, దేవస్థానం పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.