VSP: ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో అలసత్వం వహించకూడదని ఆర్డీవో లోకేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గడువులోగా సేవలు అందించాలన్నారు. బుధవారం డుంబ్రిగుడ ఎమ్మార్వో ఆఫీసులో తహశీల్దార్, వీఆర్వోలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పంపిణీచేస్తున్న రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు.