AKP: అచ్యుతాపురం రహదారి విస్తరణలో భూములు, ఇల్లు, షాపులు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారాన్ని నగదు రూపంలో చెల్లించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం మునగపాకలో మాట్లాడుతూ.. నిర్వాసితులు కోరిన విధంగా పరిహారాన్ని చెల్లించాలని కోర్టులు కూడా సూచిస్తున్నట్లు పేర్కొన్నారు.