నెల్లూరు: కావలికి చెందిన దరిశి వెంకట సత్య ధనూష జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచారు. ఆమె ఎంపికతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కావలి MLA కావ్య కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ధనూషాను, ఆమె కుటుంబాన్ని అభినందించారు. కష్టపడితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ధనూష విజయం నిరూపించిందని వారు పేర్కొన్నారు.