ప్రకాశం: బేస్తవారిపేట మండలం కొత్తపేట గ్రామంలో బుధవారం విద్యుత్ మరమ్మతుల పనులు చేస్తుండగా కరెంట్ పోల్ పైనుంచి జారిపడి బిచ్చాల బుజ్జి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లైన్ మెన్‌కు హెల్పర్‌గా వెళ్ళి కరెంట్ పోల్‌పై మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.