నెల్లూరు కార్పొరేషన్ పోరులో మంత్రి నారాయణ వ్యూహాలతో సీనియర్లు, యువత అంటూ టీడీపీ తిరుగులేని జోరు ప్రదర్శిస్తుంటే, పోటీకి అభ్యర్థులు దొరకక వైసీపీ డీలా పడిపోయింది. యువత, సీనియర్ల కలయికతో టీడీపీ కేడర్ గెలుపు ధీమాతో ఉండగా, ఓటమి భయంతో వైసీపీ నేతలు వెనకడుగు వేస్తుండటంతో ఎన్నికలకు ముందే నెల్లూరు రాజకీయం ఏకపక్షంగా మారుతోందని నాయకులు చర్చించుకుంటున్నారు.