KKD: తుని పట్టణంలోని సాయి వేదిక ఫంక్షన్ హాల్లో ఈనెల 13న విశ్వశాంతి కోసం సర్వమత సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ప్రచార పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు పాల్గొని శాంతి, సామరస్యాలపై ప్రసంగించనున్నారని ప్రతినిధులు తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.