కడప: పులివెందుల మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ రమేశ్ తెలిపారు. రాయలపురం, తుమ్మలపల్లి, రచ్చుమర్రిపల్లి, పెద్దరంగాపురం తదితర గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నందున పోల్స్ షిఫ్టింగ్ కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.