E.G: రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద ఇటీవల గుర్తు తెలియని సుమారు 6 నెలల చిన్నారిని స్థానికులు గుర్తించి రెండో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఛైల్డ్ లైన్ 1098కు సమాచారం అందించడంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సిబ్బంది చిన్నారిని శిశు గృహకు చేర్చి సంరక్షిస్తున్నారు. ఈ పాప వివరాలు తెలిసిన వారు పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు.