CTR: పుంగనూరు మండలం గూడూరు పల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నూతన అధ్యక్షులుగా పురుషోత్తమ రాజును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.