ATP: మంగళగిరిలోని NTR భవన్లో జరుగుతున్న క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలతో కలిసి “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో ఆత్మీయంగా ముచ్చటించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందిస్తున్న సేవలను కొనియాడారు. వారి అభిప్రాయాలు, క్షేత్రస్థాయి ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు.