CTR: విధుల్లో ఉండగా మరణించిన ట్రాఫిక్ ఏఎస్సై మొహమ్మద్ రఫీ కుటుంబానికి ఐడీఆర్ఎఫ్ ఫండ్ నుంచి రూ.1 లక్ష చెక్కును ఎస్పీ తుషార్ డూడి అందజేశారు. జిల్లా సాయుధ దళం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మృతుడి సతీమణి షకీరకు చెక్కు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తూ, పోలీస్ శాఖ తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.