KDP: మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. ఈ ఏడాది పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కేంద్రం కూడా మంజూరైందన్నారు. ఏప్రిల్ 4వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు చివరి రోజన్నారు. 10వ తరగతి పాసైన వారు, పది పరీక్ష రాస్తున్న వారు ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హులని చెప్పారు.