GNTR: వడ్లమూడి వర్సిటీలో డ్రగ్స్‌పై అవగాహనకు ‘దండి మార్చ్ 2.0’ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఏపీ ఈగల్ ఐజీపీ రవికృష్ణ సోమవారం పాల్గొన్నారు. డ్రగ్స్ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పని ఆయన హెచ్చరించారు. వీటికి పెట్టే ఖర్చు ఉగ్రవాదులకు చేరుతోందన్నారు. నార్కో టెర్రరిజంపై యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.