ASR: పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ మద్దివీధిలో ఆవులు, పాడి గేదెలు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలుషిత నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు, అంతుచిక్కని వ్యాధులు, సరైన వైద్యం అందకపోవడంతో చనిపోతున్నాయని గిరిజనులు చెబుతున్నారు. అధికారులు స్పందించి మద్దివీధిలో పశువైద్య శిబిరం ఏర్పాటుచేసి మూగ జీవాల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.