SKLM: మందస మండలం బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు నల్ల రిబ్బన్లు ధరించి సోమవారం నిరసన తెలిపారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు మేరకు మార్చి 23 నుండి 31 వరకు నిరసనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తమ పంట భూములను ఏ పరిస్థితుల్లోనూ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇవ్వబోమని స్పష్టం చేశారు.