కృష్ణా: వీబీజీరామ్‌జీ యాక్ట్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీబీజీరామ్‌జీ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించడం అని అన్నారు. ఈ చట్టం ద్వారా గ్రామస్థాయిలో అమలయ్యే పథకాల పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యం సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.