VZM: వృద్ధులకు జనన దృవీకరణ పత్రం జారీలో అలసత్వం నివారించాలని జన జాగృతి ఉత్తరాంధ్ర కన్వీనర్ శీరపు శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు గురువారం స్దానిక MLA అతిధి గజపతిరాజుకి ఆమె క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. వృద్ధులకు జరుగుతున్న నష్టాన్ని వివరించి, జిల్లాలో ఈ సమస్యతో 3,733 మంది వృద్ధలు ఇబ్బంది పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు.