WG: రాబోయే వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో భీమవరం కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలను గుర్తించి అక్కడ తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు.