E.G: ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని గోపాలపురం ఎస్సై పి.శివగణేశ్ సూచించారు. గురువారం గోపాలపురం చెక్ పోస్ట్ సెంటర్లో వాహనదారులకు అవగాహన కల్పించారు. రహదారిపై ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదని, ప్రాణాలు కోల్పోతే ఆయా కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించాలని కోరారు.