ASR: 516-ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ టీ.నిశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. రహదారి నిర్మాణ పనులు అత్యంత నాణ్యతతో ఉండాలని, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించకూడదన్నారు. పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు, ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.