BPT: ఇంటర్ ఫలితాల్లో రేపల్లె మండలం ఉప్పూడి గ్రామానికి చెందిన కర్రా శ్రీజ ప్రతిభ చాటింది. 500లకు గానూ, 492 మార్కులు సాధించి రాష్ట్రంలో 5వ ర్యాంక్ అందుకుంది. వేమూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ కుమార్తె అయిన శ్రీజ, హిమాయత్‌నగర్‌లోని NTR ఉమెన్స్ జూనియర్ కాలేజీలో చదువుతోంది. ఆమె విజయంపై స్థానికుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.