TPT: పుత్తూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 9:30 గంటల నుంచి 5 వరకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరగనుందని MPDO శ్రీదేవి తెలియజేశారు. గ్రామాలలో నీటి భద్రత, సహజ భాగస్వామ్యంపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరుకావాలని ఆమె కోరారు.