NDL: ఎగువ అహోబిలంలోని శ్రీ కారంజ నరసింహస్వామి ఆలయం వద్ద ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ కారంజ నరసింహస్వామి గేట్ వద్ద సిబ్బందికి ఏర్పాటు చేసిన షెల్టర్ షార్ట్ సర్క్యూట్తోె కాలిపోయింది. ఈ ఘటనలో కంటైనర్లో భద్రపరిచిన సీసీ కెమెరా ఫుటేజ్, దానికి సంబంధించిన పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై దేవస్థానం అధికారులు ఆరా తీస్తున్నారు.