GNTR: ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా తెనాలి మండలం పెదరావూరు జడ్పీ స్కూల్ డ్రాయింగ్ టీచర్ వెంకటకృష్ణ (కృష్ణశ్రీ) వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఏ3 షీట్‌పై ‘ప్రపంచ కళా దినోత్సవం’ అనే అక్షరాలతోనే ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రాన్ని కలర్ పెన్లతో అద్భుతంగా గీశారు. కాగా, లియోనార్డో డా విన్సీ జయంతిని ఏటా ఈ దినోత్సవంగా జరుపుకుంటారు.