అన్నమయ్య: రాయచోటిలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ కేజీ రూ.240, స్కిన్లెస్ చికెన్ రూ.260గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.950గా స్థిరంగా కొనసాగుతోంది. చేపలలో కొరమేను రూ.450, రాగండి రూ.200, బొచ్చెలు రూ.230గా ఉన్నాయి. ఆదివారం సందర్భంగా చికెన్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినప్పటికీ వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు.