కృష్ణా: కొడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉల్లిపాలెంలో పోలీసులు ఆదివారం మెరుపు దాడులు నిర్వహించారు. జూదం జరుగుతున్నదన్న సమాచారంతో SI కె. చాణక్య ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,070ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.