KRNL: తుగ్గలి మండల పరిధిలోని చెరువు తండా గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. హనుమంత నాయక్, సరోజమ్మ దంపతుల కుమారుడు చరణ్ పై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాలుడి పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి చిన్న పిల్లలను కాపాడాలని కోరుకున్నారు.