ప్రకాశం: చీమకుర్తి బాలికల వసతి గృహాన్ని ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థినులకు అందుతున్న వసతులు, విద్యా ప్రమాణాలు, పారిశుద్ధ్య నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి విద్యార్థులతో కలిసి అల్పాహారం సేకరించారు. ఆహార నాణ్యతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.