సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జి.శ్రీనివాస్‌ను కొత్త కమిషనర్‌గా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన కమిషనర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.