ASR: జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా శ్రీపూజ శనివారం కలెక్టరేట్లో బాధ్యతలను స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్ అధికారులను ప్రమోషన్లపై చేసిన బదిలీల్లో భాగంగా ఆమెను ఐటీడీఏ పీవో నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించింది. ఐటీడీఏ పీవో బాధ్యతలను నూతనంగా ఆదిత్య వర్మకు అప్పగించారు.