PLD: రొంపిచర్ల హైవేపై శుక్రవారం రైతులతో కలిసి వైసీపీ నేతలు ధర్నా చేశారు. రోడ్డుపై మొక్కజొన్నలు పారబోసి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ.. పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు లాభాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. తక్షణమే క్వింటాల్ రూ.2,400కు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.