E.G: పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మృతి చెందిన పల్లా దానయ్య కుటుంబ సభ్యులను మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ పరామర్శించారు. అనంతరం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా చెక్కును మంత్రి అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.