AKP: పాయకరావుపేటలో నమోదు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి ఎలమంచిలి కోర్టు రూ.10,000 జరిమానా విధించినట్లు సీఐ అప్పన్న తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న పి. వెంకటరమణపై కేసు నమోదు చేసి ఎలమంచిలి కోర్టులో మంగళవారం హాజరు పరిచామన్నారు. ముద్దాయి జరిమానా కట్టలేనందున 6 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఎలమంచిలి సబ్ జైలుకు తరలించామన్నారు.