కృష్ణా: విజయవాడ వెస్ట్ బైపాస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. కానూరుకి చెందిన జగదీష్ HYDలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుల నిమిత్తమై ఇంటికి వచ్చి HYD వెళుతుండగా గురువారం ఉదయం వెదురుపావులూరు టోల్ గేట్ దాటిన తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.