సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కర్ణాటక నాగేపల్లి వంతెన సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఇసుక తవ్వకాలను పోలీసులు అడ్డుకున్నారు. సీఐ తిమ్మారెడ్డి నేతృత్వంలోని పోలీసులకు అందిన పక్కా సమాచారంతో మెరుపు దాడి నిర్వహించారు. 3 ట్రాక్టర్లతో పాటు ఒక హిటాచీ యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.