కోనసీమ: జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 10 నుంచి నగదు చెల్లింపులను కేంద్ర రవాణా శాఖ నిలిపివేసింది. అన్నంపల్లి టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. యూపీఐ ద్వారా చెల్లించే సదుపాయం ఉన్నప్పటికీ, సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాహనదారులు ఫాస్టాగ్ సిద్ధం చేసుకోవాలన్నారు.